Breaking
Tue. Nov 18th, 2025

Konaseema Internet shutdown: కోన‌సీమ‌లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌.. ఇబ్బందుల్లో ఉద్యోగులు, విద్యార్థులు !

Konaseema, Internet shutdown, Internet Services,India , Amalapuram , Andhra Pradesh, కోన‌సీమ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఇంటర్నెట్‌ సేవలు, ఇంట‌ర్నెట్ బంద్‌, ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌, అమ‌లాపురం, సీఎం జ‌గ‌న్‌, విద్యార్థులు, ఉద్యోగులు,

దర్వాజ-అమరావతి

Amalapuram-Internet Services: కోనసీమ ఆందోళనల తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేయడంతో దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా నెట్ బ్లాక్‌అవుట్ సంఖ్య 645కు చేరుకుంది. ప్రధానంగా శాంతిభద్రతల సమస్యల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కేవలం నాలుగు ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు ఉన్నాయి. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో జమ్మూ కాశ్మీర్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

కోనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన హింసతో, ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ఇక కోనసీమ జిల్లాలో నాలుగు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోవడంతో వర్క్‌ ఫ్రంహోం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్‌వర్క్‌ కోసం జిల్లా సరిహద్దులు దాటి, ల్యాప్‌టాప్‌లతో వెళ్లి వర్క్‌ చేసుకుంటున్నారు. అంత‌ర్జాల సేవ‌ల‌ను వెంట‌న‌నే పున‌రుద్ద‌రించాల‌ని అధికారుల‌ను, ప్ర‌భ‌త్వాన్ని కోరుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కొన‌సాగుతున్న త‌రుణంలో విధులు నిర్వ‌హించడం క‌ష్టంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఆన్‌లైన్ క్లాసులు మిస్ అవుతున్నామ‌ని విద్యార్థులు వాపోతున్నారు. అలాగే, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆధార‌ప‌డి చిన్న చిన్న వ్యాపారాలు కూడా కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ఇంటర్నెట్ ష‌ట్‌డౌన్ వారిపై ప్ర‌భావం చూపుతోంది.

జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన అల్లర్లు, దహన ఘటనలకు సంబంధించి 19 మందిని అరెస్టు చేశారు. మొత్తం 70 మందికి పైగా నిందితుల‌ను గుర్తించిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Related Post