Breaking
Tue. Nov 18th, 2025

Cylinder Blast: పేలిన సిలిండర్‌.. నలుగురు మృతి

Death, Afghanistan, suicide blast, UNAMA, Kabul, మరణాలు, ఆఫ్ఘనిస్తాన్, ఆత్మాహుతి దాడి, యునామా , కాబూల్,

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి
Anantapur: సిలిండర్ పేలుడు కార‌ణంగా భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. ఈ దుర్ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతి చెందిన నలుగురిలో ఇద్దరు మహిళలు, ఒకరు మూడేళ్ల చిన్నారి ఉన్నారు. మృతులను జైనాబీ (60), దాదు (36), షర్ఫున్ని (28)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ ను నిర్వ‌హించారు.

Related Post