దర్వాజ-సినిమా
Actor Vijay Babu: రేప్ కేసులో చిక్కున్న ఓ హీరో.. కోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకెళ్తే.. తనపై నమోదైన అత్యాచారం కేసులో మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుకు కేరళ హైకోర్టు మంగళవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై ఒక నటి ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే దుబాయ్‌కు పారిపోయిన బాబు, తిరిగి ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాలని సూచించారు. జూన్ 2 వరకు బాబును అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది. కాగా, తాను దేశానికి తిరిగి రావడాన్ని సూచించే ప్రయాణ పత్రాలను సమర్పించిన తర్వాతనే ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు చెప్పడంతో బాబు మే 30న భారతదేశానికి తిరిగి రావడానికి విమాన టిక్కెట్‌ను సమర్పించారు. అయితే ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేస్తారన్న భయంతో టికెట్ రద్దు చేసుకుని షెడ్యూల్ ప్రకారం తిరిగి రాలేదు.
సినిమాల్లో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తామంటూ ఎర్నాకులంలోని తన ఫ్లాట్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ బాధితురాలు పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న విజయ్‌బాబుపై సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబు మలయాళ చలనచిత్ర నిర్మాత, నటుడు మరియు వ్యాపారవేత్త. మలయాళ చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఫ్రైడే ఫిల్మ్ హౌస్ వ్యవస్థాపకుడు.