Breaking
Tue. Nov 18th, 2025

Crime: ప్రేమించలేదని బాలిక‌ను 14 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

ప్రియురాలు,హత్య, ప్రియుడు, అరెస్టు, పోలీసులు, న్యూఢిల్లీ, Girlfriend, Murder, Boyfriend, Arrest, Police, New Delhi,

ద‌ర్వాజ‌-చెన్నై

Tamil Nadu Crime: తమిళనాడులోని తిరుచ్చిలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. త‌నను ప్రేమించ‌డం లేద‌నే కోపంతో ఓ ప్ర‌మోన్మాది బాలిక‌పై క‌త్తితో దాడి చేశాడు. 14 సార్లు కత్తితో బాలిక శ‌రీరంపై పొడిచాడు. బాధితురాలు ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతోంది. 16 ఏళ్ల బాలికను 22 ఏళ్ల యువకుడు 14 సార్లు కత్తితో పొడిచాడు. బాధితురాలు ప్ర‌స్తుతం ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతోంది. దాడికి పాల్ప‌డిన వ్యక్తిని కేశవన్‌గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తిరుచ్చిలోని అతికుళానికి చెందిన బాలిక 11వ తరగతి చదువుతోంది. పరీక్షలు ముగించుకుని బాధితురాలు తన బంధువును కలిసేందుకు వెళ్తుండగా రైల్వే ఓవర్‌పాస్‌ సమీపంలో నిందితుడు కేశవన్ ఆమెను అడ్డుకున్నాడు. ఆమెకు ప్రేమిస్తున్నాన‌ని చెప్ప‌గా.. బాలిక దీనిని తిర‌స్క‌రించింది. దీంతో నిందితుడు ఆమెపై క‌త్తితో దాడి చేసి.. 14 పోట్లు పొడిచాడు. కాగా, మైనర్‌ బాలికను కేశవన్‌ వేధిస్తున్నాడు. జూన్ 2021లో అదే బాలికను కిడ్నాప్ చేసినందుకు కేశవన్‌పై బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం, 2012 (పోక్సో) కింద ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాధితురాలి బంధువు తెలిపారు.

నేరం జరిగిన రోజు నిందితుడు బాలికను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. బాలిక అతనిని తిరస్కరించడంతో, బాధితురాలు సహాయం కోసం పిలిచేలోపే కేశవన్ ఆమెను 14 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం కత్తిని నేరం జరిగిన ప్రదేశంలో వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కేశవన్‌గా గుర్తించిన నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేయగా, మనప్పారై సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం ల‌భించింది. మృతదేహం కేశ‌మ‌న్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహం దగ్గర నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తండ్రి కేశవన్‌ని తీసుకొచ్చి మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఇంకా ఇది పూర్తిగా నిర్ధార‌ణ కాలేదు.

Related Post