Breaking
Tue. Nov 18th, 2025

Rape case: రోడ్డు దాటిస్తాన‌ని చెప్పి.. అంధురాలిపై అత్యాచారం..

Delhi , rapes , woman , visually challenged woman, cross road, police , Swati Maliwal, ఢిల్లీ , అత్యాచారాలు , మహిళ , దృష్టిలోపం ఉన్న మహిళ, క్రాస్ రోడ్, పోలీస్ , స్వాతి మలివాల్,

దర్వాజ-న్యూఢిల్లీ

Delhi man rapes visually challenged woman: కంటిచూపులేని ఓ మ‌హిళ‌ను రోడ్డు దాటిస్తాన‌ని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక‌దాడి చేశాడు ఓ దుండ‌గుడు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ద‌బ్రీ ప్రాంతంలో ఒక వ్యక్తి దృష్టిలోపం ఉన్న మహిళను రోడ్డు దాటడానికి సహాయం చేస్తాన‌ని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధిత మ‌హిళ బ‌స్సులో ప్రాయాణిస్తుండ‌గా.. ఆమె దిగాల్సిన బ‌స్టాప్ లో కాకుండా వేరే బ‌స్టాప్ లో దిగింది. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి ఆమెను రోడ్డు దాటేందుకు సహాయం చేస్తాన‌ని చెప్పి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్.. “మే 25న, ఒక అంధ బాలిక పొరపాటున మరొక బస్టాప్‌లో దిగింది. ఆమెను రోడ్డు దాటడానికి సహాయం చేస్తాననే నెపంతో ఒక వ్యక్తి ఆమెను వీధిలోకి తీసుకువెళ్లాడు.. ఈ క్ర‌మంలోనే ఆమెపై అత్యాచారం చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నేను అమ్మాయిని కలిశాను.. ఆమెకు అండ‌గా నిలుస్తాం” అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.

Related Post