Breaking
Tue. Nov 18th, 2025

Afghanistan earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం.. 1000 మంది మృతి.. వేల మందికి తీవ్ర గాయాలు

Afghanistan, earthquake, Death toll, 1000 Deaths, Paktika province, European seismological agency,Pakistan, India, ఆఫ్ఘనిస్తాన్, భూకంపం, మరణాల సంఖ్య, 1000 మరణాలు, పక్తికా ప్రావిన్స్, యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ, పాకిస్థాన్, భారతదేశం,

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Afghanistan earthquake: బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం 1000 మందికి పైగా ప్రాణాలు బ‌లిగొంద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ప్రభుత్వ బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం 1500 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్ నగరానికి 44 కి.మీ (27 మైళ్లు) దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జీసీ) తెలిపింది. భూకంప ప్ర‌భావం అధికంగా పక్తికా ప్రావిన్స్ లో ఉంద‌ని అధికారులు తెలిపారు.


తూర్పు ఆఫ్ఘన్ లోని పక్తికా ప్రావిన్స్ అధికంగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక్కడ 255 మంది మరణించారు. అలాగే, 200 మందికి పైగా గాయపడ్డార‌ని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్ అయుబి చెప్పారు. ఖోస్ట్ ప్రావిన్స్‌లో 25 మంది మరణించారని, 90 మందిని ఆసుపత్రికి తరలించామ‌ని వెల్ల‌డించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం అంతటా 119 మిలియన్ల మంది ప్రజలు 500 కిలోమీటర్ల (310 మైళ్ళు) పైగా భూకంప ప్రకంపనలను అనుభవించారని యూరోపియన్ సీస్మోలాజికల్ ఏజెన్సీ, EMSC తెలిపింది.

Related Post