Breaking
Sat. Jun 28th, 2025

UPSC Civil Service Result 2022: యూపీఎస్సీ సివిల్ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి !

UPSC, Civil Service, Result, UPSC Civil Service, UPSC Civil Service Result , UPSC Civil Service Result 2022, యూపీఎస్సీ, సివిల్ స‌ర్వీస్‌, ఫ‌లితాలు, యూపీఎస్సీ సివిల్ స‌ర్వీస్‌, యూపీఎస్సీ రిజ‌ల్ట్, సివిల్ స‌ర్వీస్ ఫ‌లితాలు, యూపీఎస్సీ సివిల్ స‌ర్వీస్ ఫ‌లితాలు 2022,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

UPSC Civil Service Result 2022: యూపీఎస్సీ సివిల్ ప్రిలిమ్స్ ఫ‌లితాలు-2022 విడుద‌ల‌య్యాయి. UPSC సిలిల్స్ ప్రిలిమ్స్ 2022 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ సంవత్సరం ప్రిలిమ్స్ పరీక్ష 5 జూన్ 2022న నిర్వహించారు. 2022 ప్రీ ఎగ్జామినేషన్‌కు హాజరైన అభ్యర్థులందరూ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు వారి రోల్ నంబర్‌ను ఉపయోగించాలి. అభ్యర్థులు తమ వద్ద అడ్మిట్ కార్డును ఉంచుకోవాలని ఇదివ‌ర‌కే అధికారులు సూచించారు.

ఫ‌లితాలు విడుద‌ల !

UPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్ర‌లిమ్స్ ఎగ్జామ్స్ ఫలితాల‌ను అప్‌లోడ్ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన దశల సహాయంతో వారి ఫలితాలను తెలుసుకోవచ్చు.

  1. ఫలితాన్ని తనిఖీ చేయడానికి ముందుగా UPSC వెబ్‌సైట్ upsc.gov.in కి వెళ్లండి.
  2. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో UPSC ప్రిలిమ్స్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
  3. ఆ తర్వాత రోల్ నంబర్ మరియు అభ్యర్థించిన ఇతర సమాచారాన్ని నమోదు చేయండి.
  4. ఎంట‌ర్ క్లిక్ చేస్తే.. మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  5. ఇప్పుడు దాన్ని తనిఖీ చేసి, డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ ఉపయోగం కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.

సాధార‌ణంగా UPSC సివిల్ సర్వీస్ ఫలితాల‌ను పరీక్ష తర్వాత 15 నుండి 20 రోజులలో వెల్ల‌డిస్తారు. అందుకే ఈ రోజు కమిషన్ ఫలితాలను ప్రకటించింది. ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 5న నిర్వహించారు. పేపర్ 1ని ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించారు.

Darvaaja youtube button

Related Post