Mon. Dec 16th, 2024

Coronavirus: క‌రోనా క‌ల‌వ‌రం.. మ‌ళ్లీ పెరిగిన కొత్త కేసులు

India, Covid-19, Coronavirus, క‌రోనా వైర‌స్, కోవిడ్-19, భార‌త్,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Coronavirus updates: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 16,159 కరోనావైరస్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,35,47,809కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,15,212కి పెరిగాయి.

క‌రోనాతో చ‌నిపోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో కోవిడ్‌-19తో పోరాడుతూ 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,25,270కి చేరుకుంది. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,07,327 కు పెరిగింది. కోవిడ్-19 రికవరీ రేటు 98.53 శాతం, మ‌ర‌ణాలు రేటు 1.21 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగా మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, హ‌ర్యానాల్లో న‌మోద‌య్యాయి.

Share this content:

Related Post