దర్వాజ-హైదరాబాద్
LPG price hiked: వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జూలై 6 నుండి 14.2 కిలోల సిలిండర్ ధరను ₹50 పెంచినట్టు వెల్లడించాయి. దీంతో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే దేశంలో అధిక ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం, నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతుండటం సామాన్యులను కలవరానికి గురిచేస్తున్నది.
గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ పై రూ.50 పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధరలు రూ.1100లకు పైగా పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ₹1,003 నుండి ₹1,053.00లకు పెరిగింది. ముంబలో కొత్త ధర ₹1,052.50గా ఉండగా, చెన్నైలో ₹1,068.50, కోల్‌కతాలో ₹1,079.00గా ఉంది. హైదరాబాద్‌లో రూ.1,100 మార్కును అధిగమించాయి. మే 19 నుండి ₹1,055 పెరిగిన సిలిండర్ ధరలు ప్రస్తుతం తెలంగాణలో సిలిండర్‌కు ₹1,105 చెల్లించాల్సి ఉంటుంది.
Share this content: