దర్వాజ-న్యూఢిల్లీ
Kullu Floods: దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కులు జిల్లాలో బుధవారం భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా 7 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. జిల్లాలోని మలానా పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 25 మందికి పైగా ఉద్యోగులను భవనం నుంచి సురక్షితంగా రక్షించినట్టు అధికారులు తెలిపారు. వరదలతో ఈ భవనం దెబ్బతింది.
అలాగే, మణికరణ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలలో నలుగురు కొట్టుకుపోయారని సమాచారం. పార్వతి నదిపై వంతెన దెబ్బతిన్నది. భారీ వర్షాల మధ్య కులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు నీట మునిగిపోయారని స్థానికులు పేర్కొన్నారు. కులు జిల్లాలోని చల్లాల్ పంచాయతీలోని చోజ్ గ్రామంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ మోఖ్తా తెలిపారు. చోజ్‌లో భారీ వర్షం కారణంగా పార్వతి నదిపై ఉన్న వంతెన కూడా దెబ్బతిన్నదని కులు పోలీసు సూపరింటెండెంట్ గుర్దేవ్ శర్మ తెలిపారు. నలుగురు గల్లంతయ్యారని చెప్పారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందన్నారు.
అదే సమయంలోభారీగా వరద నీరు వస్తుండటంతో లార్జీ, పండోహ్ డ్యామ్‌ల గేట్లు తెరవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.ముంపు ప్రాంతాల్లో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
Incessant overnight rains led to a devastating #cloudburst-like situation in the Parvati Valley of #Kullu district, #HimachalPradesh. The subsequent flash floods & landslides washed away at least seven people.
— The Weather Channel India (@weatherindia) July 6, 2022
Details: https://t.co/bxWESh16VR
pic.twitter.com/uKakGsXkdp
Thread👇
Share this content: