Breaking
Tue. Nov 18th, 2025

Amarnath yatra: మ‌ళ్లీ ప్రారంభ‌మైన అమ‌ర్‌నాథ్ యాత్ర‌.. తాజా వివ‌రాలు ఇవే.. !

Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు, Amarnath yatra, Baltal trek, cloudburst,pilgrims , Ganderbal , అమ‌ర్‌నాథ్ యాత్ర‌, జ‌మ్మూకాశ్మీర్‌,అమర్‌నాథ్ యాత్ర, బల్తాల్ ట్రెక్, క్లౌడ్‌బర్స్ట్, యాత్రికులు, గందర్‌బాల్,

దర్వాజ-న్యూఢిల్లీ

Amarnath yatra Update: భారీ క్లౌడ్‌బర్స్ట్ త‌ర్వాత మ‌ళ్లీ అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభ‌మైంది. అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తెల్లవారుజామున 7,000 మంది యాత్రికులు శ్లోకాలు, భ‌త‌వంతుని నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో పవిత్ర అమ‌ర్‌నాథుని గుహ వైపు బాల్తాల్ బేస్ నుంచి యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 16 మంది యాత్రికులు మరణించడం, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడిన కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంకా 40 మందికి పైగా గల్లంతయ్యారని, వారు బతికే అవకాశాలు ఉన్నాయ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

బాల్తాల్ బేస్ క్యాంప్ నుండి పవిత్ర గుహకు ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది. యాత్రికులు 14 కి.మీ కాలిన‌డ‌క‌న ముందుకు సాగాల్సి ఉంటుంది. సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో ఉన్న బాల్తాల్, అమర్ నాథుని పవిత్ర గుహ వైపు చిన్నదైనది.. కానీ కష్టతరమైన ట్రెక్‌గా పరిగణించబడుతుంది. “ఈరోజు ఉదయం బాల్తాల్‌ యాక్సిస్ ద్వారా నాలుగు రోజుల తర్వాత అమ‌ర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభించబడింది” అని డిప్యూటీ కమిషనర్ (గందర్బాల్) ఒక ట్వీట్‌లో తెలిపారు.

సోమవారం నాడు వేలాది మంది యాత్రికులు అమ‌ర్‌నాథుని గుహ వైపు బయలుదేరడంతో దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ ట్రెక్ ద్వారా యాత్ర తిరిగి ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం వేలాది మంది యాత్రికులు పవిత్ర గుహలోకి వెళుతుండగా ప్రవహించే నీళ్లతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని దాటవేస్తూ గుహ సమీపంలో సైన్యం కొత్త మార్గాన్ని నిర్మించింది.

Related Post