Breaking
Tue. Nov 18th, 2025

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు.. దేశంలో మొత్తంగా 9

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, Delhi, monkeypox, Nigerian woman, India, monkeypox cases, Lok Nayak hospital, ఢిల్లీ, మంకీపాక్స్, నైజీరియన్ మహిళ, భారతదేశం, మంకీపాక్స్ కేసులు, లోక్ నాయక్ హాస్పిటల్,

దర్వాజ-న్యూఢిల్లీ

Monkeypox: ఇప్పటివరకు ఆఫ్రికా దేశాల్లో మాత్ర‌మే కనిపించే మంకీపాక్స్ కేసులు.. ప్ర‌స్తుతం చాలా దేశాలకు వ్యాపించాయి. మన దేశంలో కూడా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కాగా, మన దేశంలో బుధ‌వారం మ‌రో మంకీపాక్స్ కేసు న‌మోదైంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య 9కి పెరిగింది. నైజీరియాకు చెందిన ఓ మ‌హిళ‌కు మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ గా వ‌చ్చింది.

తాజా కేసుతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు నాలుగుకు పెరిగాయి. 31 ఏళ్ల నైజీరియన్ మ‌హిళ‌ మంకీపాక్స్ పాజిటివ్ పరీక్షించిన తర్వాత ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, భార‌త్ తొలి మంకీపాక్స్ కేసు ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌లో జూలై 14న న‌మోదైంది. మంకీపాక్స్ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Related Post