Breaking
Tue. Nov 18th, 2025

బీజేపీ నుండి తెరాస‌లోకి చేరిక‌లు

దర్వాజ – సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నంగునూర్ మండలం సిద్ధన్నపేట గ్రామంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన పది మంది కార్యకర్తలు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related Post