Breaking
Tue. Nov 18th, 2025

ఆసియా కప్ 2022 : ఉత్కంఠ పోరులో భార‌త్ గెలుపు

ద‌ర్వాజ‌, తెలుగు వార్త‌లు, తాజా వ‌ర్తాలు, Darvaaja, Telugu News, Latest News, Asia Cup 2022, Pakistan, India vs Pakistan, Live Cricket Score, India , Cricket , ఆసియా కప్ 2022, పాకిస్థాన్, ఇండియా vs పాకిస్థాన్, లైవ్ క్రికెట్ స్కోర్, ఇండియా , క్రికెట్, క్రీడలు,

దర్వాజ-క్రీడలు

ఆసియా కప్ 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022లో నేడు (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భార‌త్-పాకిస్థాన్ ల మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ పోరులో భార‌త్ విజ‌యం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై గెలుపొందింది. 19.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని చేధించింది. భార‌త ఆట‌గాళ్ల‌లో విరాట్ కోహ్లీ 35, ర‌వీంద్ర జ‌డేజా 35, హ‌ర్ధిక్ పాండ్యా 33 ప‌రుగుల‌తో రాణించారు. అంత‌కుముందు భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో పాకిస్తాన్ 147 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌టి ఇన్నింగ్స్ బ్యాంటింగ్ కు దిగిన పాకిస్థాన్ 3వ ఓవ‌ర్ లో మొద‌టి వికెట్ (బాబ‌ర్) కోల్పోయింది. 19.5 ఓవ‌ర్ల‌లో147 పరుగులకు ఆలౌట్ అయింది. రిజ్వాన్ (43 ప‌రుగులు), ఇఫ్తికార్ అహ్మద్ (28) బ్యాటింగ్ లో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 వికెట్లు తీయ‌గా, హ‌ర్ధిక్ పాండ్యా 3, హ‌ర్ష‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నారు.

Related Post