Breaking
Tue. Nov 18th, 2025

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు అన్నీ ముందే తెలుసు.. : ప్రోబ్ ఏజెన్సీ

darvaaja,latest news,Telugu news, తాజా వ‌ర్తాలు, తెలుగు వార్త‌లు, ద‌ర్వాజ‌, Jacqueline Fernandez, Sukesh, Enforcement Directorate, criminal history, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుఖేష్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నేర చరిత్ర,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి తెలుసుకుని, కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు నుండి బయటపడేందుకు తప్పుడు కథను ఆమె చెబుతున్నార‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. “సుకేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి, లీనా మారియా పాల్ అతని భార్య గురించి 2021 ఫిబ్రవరిలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి బాగా తెలుసు” అని చార్జిషీట్ పేర్కొందని ఎన్డీటీవీ నివేదించింది.

“జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు అన్ని తెలుసు.. ఆమె స్పృహతో అతని నేర గతాన్ని విస్మరించడాన్ని ఎంచుకుంది. అతనితో ఆర్థిక లావాదేవీలను కొనసాగించింది” అని పేర్కొంది. ఫిబ్రవరి 2021లో సుఖేష్ చంద్రశేఖర్ సంబంధించిన వివ‌రాలు, నేర చరిత్ర గురించి ఆమె హెయిర్ స్టైలిస్ట్ షాన్ ఆమెకు తెలియజేశాని తెలిపింది. “ఇది జరిగినప్పటికీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వాస్తవాన్ని విస్మరించారు. సుఖేష్ తో సంబంధాన్ని కొనసాగించారు. సుఖేష్ నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందారు.. అవి నేరాల ద్వారా వచ్చే ఆదాయం తప్ప మరేమీ కాదు” అని ఏజెన్సీ పేర్కొంది.

Related Post