Breaking
Tue. Nov 18th, 2025

అన్నదానం..మహాదానం

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలోని ఎస్సీ కాల‌నీలో ఆది జాంబవ యూత్ ఆధ్వర్యంలో సిద్దివినాయ‌క నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం నంగునూరు పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్ సౌజన్యంతో అన్నదాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కోల రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో అనందంగా జీవించేలా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండేలా దేవదేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తితోనే మనిషికి ముక్తి లభిస్తుందని, అందరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అన్నారు. ఈ సంద‌ర్భంగా పీఏసీఎస్ చైర్మన్ ను యూత్ స‌భ్యులు శాలువ‌లు క‌ప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నంగునూరు పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్, తెరాస నాయకులు రచ్చ సిద్దు. ఎస్సీ స‌మాజ‌ అధ్యక్షుడు దేవులపల్లి హరిబాబు, వార్డ్ మెంబర్స్ దేవులపల్లి గణేష్, దేవులపల్లి శోభ కనకయ్య, దేవులపల్లి ఐలయ్య, దేవులపల్లి రాజేందర్, లింగాల నరసింహులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దేవులపల్లి బొక్కల శివకుమార్, దేవులపల్లి ప్రవీణ్ కుమార్, కందికట్ల కిషన్, నాగిల్ల రవీందర్, గండిపల్లి సంతోష్, దమ్మగళ్ళ బిక్షపతి, దేవులపల్లి బొక్కల శేఖర్, దేవులపల్లి నరసింహ, దేవులపల్లి భాను తదితరులు పాల్గొన్నారు.

Related Post