Breaking
Tue. Nov 18th, 2025

జాతీయ జెండాతో స్కూటీ శుభ్రం.. పోలీసుల అదుపులో నిందితుడు

Madhya Pradesh, Minor, Dalit, rape victim, police station, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ద‌ళిత బాలిక‌, అత్యాచారం, పోలీసులు,

ద‌ర్వాజ-న్యూఢిల్లీ

National flag: తన స్కూటీని శుభ్రం చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించిన వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు దృష్టికి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన స్కూటీలోని శుభ్రం చేయడానికి జాతీయ జెండాను ఉపయోగించాడు.

స్కూటీని శుభ్రం చేయ‌డానికి జాతీయ జెండాను ఉపయోగించినందుకు 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి ఉత్తర ఘోండా ప్రాంతానికి చెందినవాడు. భజన్‌పురా పోలీస్ స్టేషన్‌లో జాతీయ గౌరవానికి అవమానం నిరోధించే చట్టం-1971 సెక్షన్ 2 కింద కేసు నమోదైంది. వ్యక్తి ఉపయోగించిన జెండా, అతని స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Related Post