Breaking
Tue. Nov 18th, 2025

ప్ర‌ముఖ టాలీవుడ్ నటుడు, రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత.. ఆయ‌న జీవిత వివ‌రాలు..

Entertainment news, Tollywood, Uppalapati Krishnam Raju, Krishnam Raju, Prabhas , వినోద వార్తలు, టాలీవుడ్, ఉప్పలపాటి కృష్ణం రాజు, కృష్ణం రాజు, ప్రభాస్ ,Rebel Star, రెబల్ స్టార్,

దర్వాజ-హైద‌రాబాద్

Veteran Tollywood actor Krishnam Raju : ప్రముఖ తెలుగు నటుడు, రెబ‌ల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణం రాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ ది వీరి కుటుంబమే. టాలీవుడ్‌లో ‘రెబల్ స్టార్’గా ప్రసిద్ధి చెందిన కృష్ణంరాజు ఐదు దశాబ్దాల కెరీర్‌లో 180కి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు సామాజిక, కుటుంబ, రొమాంటిక్, థ్రిల్లర్ చిత్రాల నుండి చారిత్రక-పౌరాణిక చిత్రాల వరకు నటించారు. అతని విజయవంతమైన చిత్రాలలో ‘అమర దీపం’, ‘సీతా రాములు’, ‘కటకటాల రుద్రయ్య’ మరియు మరెన్నో ఉన్నాయి. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం ఆయ‌న‌కు న‌టించిన చివ‌రి సినిమా.

రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. కృష్ణం రాజు 1986లో ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. 2006లో ఫిలింఫేర్ సౌత్ ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్నారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించిన కృష్ణంరాజు 1966లో ‘చిలకా గోరింక’తో సినీ రంగ ప్రవేశం చేశారు. కొన్ని సినిమాల్లో నెగ‌టివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల్లో కూడా ఆయ‌న న‌టించారు. కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన ‘గోపి కృష్ణ మూవీస్’ బ్యానర్‌పై పలు సినిమాలను కూడా నిర్మించారు.

తన తరువాతి సంవత్సరాలలో, సినిమాలతో పాటు, కృష్ణం రాజు రాజకీయాల్లో కూడా త‌న ముద్ర వేశారు. 1991లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 999 ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది 2004 వరకు వాజ్‌పేయి మంత్రివర్గంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.

Related Post