Breaking
Tue. Nov 18th, 2025

Farmers Maha Padayatra: అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్ర ప్రారంభం..

Amaravati, farmers, Maha Padayatra, Venkatapalem, AP High Court, andhrapradesh, అమరావతి, రైతులు, మహా పాదయాత్ర, వెంకటపాలెం, ఏపీ హైకోర్టు, ఆంధ్ర ప్రదేశ్,

ద‌ర్వాజ‌-అమ‌రావ‌తి

Andhrapradesh: అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర సోమ‌వారం ఉద‌యం ప్రారంభం అయింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర చేప‌ట్టారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు కొనసాగనున్న ఈ యాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించగా, ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ఇందులో దశల వారీగా పాల్గొంటారు. సోమవారం వెంకటపాలెం నుంచి బయలుదేరి ఈనెల 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి చేరుకుంటుంది. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం చేసి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, శైలజానాథ్, కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, నారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణ, తొలిరోజు 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే అమరావతి రైతుల మహా పాదయాత్రతో ఉత్తర కోస్తాంధ్రలో ఉద్రిక్తత నెలకొంది. ఈ యాత్ర అమరావతి నుంచి ప్రారంభమై గోదావరి జిల్లాల మీదుగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వరకు కొనసాగనుంది. ఇప్పటికే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిని మాత్రమే రాజధానిగా ప్రకటించాలన్న మహాపాదయాత్ర ఆసక్తికరంగా మారనుంది.

Related Post