Breaking
Tue. Nov 18th, 2025

అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండలంలోని బద్దిపడగ గ్రామంలో అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వ‌ర్యంలో గురువారం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ జిల్లా 200 గవర్నర్ అల్లీ కోటేశ్వరరావు, సిద్ధిపేట జిల్లా 162 గవర్నర్ అల్లీ రాజమల్లయ్య గౌడ్, కరీంనగర్ 137 B జిల్లా గవర్నర్ అల్లీ మోర అంజయ్య, అలయన్స్ సౌత్ ఇండియా ఛైర్మన్ అల్లీ బొజ్జ మధుసూధన్, అల్లీ సోమ వనజ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 31 మంది గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబ‌ద్దంగా బట్టలు, పూలు, పండ్లు, గాజులు, పసుపు కుంకుమల‌ను అంద‌జేసి.. సామూహిక శ్రీమంత కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అల‌య‌న్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ స‌భ్యులు మాట్లాడుతూ.. గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తహీనత గర్భిణీలకు ఒక సవాల్‌గా మారిందని, ఆ స‌మ‌స్య‌ల‌ను అధిగమించాలన్నారు. వారం వారం వైద్యులతో తనిఖీలు నిర్వహించుకోవాలన్నారు. వైద్యుల సూచనలు పాటించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మార్కెట్ క‌మిటీ చైర్మెన్ రాగుల సారయ్య, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల‌ సోమిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మెన్ వెంకటరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ ర‌మేశ్ గౌడ్, లింగం గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

alliance-2-1024x576 అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు

Related Post