Breaking
Tue. Nov 18th, 2025

Mann Ki Baat: చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు: ప్రధాని మోడీ

Mann Ki Baat, Chandigarh airport, Shaheed Bhagat Singh, PM Modi, మన్ కీ బాత్, చండీగఢ్ విమానాశ్రయం, షహీద్ భగత్ సింగ్, ప్రధాని మోడీ
BhagatSingh

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Mann Ki Baat: చండీగఢ్ విమానాశ్రయం పేరు మార‌నుంది. ఇక నుంది దానిని స్వాతంత్ర్య సమరయోధుడు ష‌హీద్ భగత్ సింగ్ పేరుతో పిల‌వ‌నున్నారు. ప్ర‌ధాని మోడీ త‌న మ‌న్ కీ బాత్ లో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వివ‌రాల్లోకెళ్తే.. చండీగఢ్ విమానాశ్రయానికి ఇకపై షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రకటించారు. సెప్టెంబర్ 28న స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

ప్రధాని మోదీ తన రేడియో ప్రసంగంలో, “నా ప్రియమైన దేశప్రజలారా, మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 28న అమృత్ మహోత్సవ్‌కు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మనం భగత్ సింగ్ జీ జయంతిని జరుపుకుంటాం. భారతమాత ముద్దు బిడ్డ‌.. ధైర్య సాహసాల‌కు ప్ర‌తీక” అని పేర్కొన్నారు.

Related Post