Breaking
Tue. Nov 18th, 2025

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి: యునామా

Death, Afghanistan, suicide blast, UNAMA, Kabul, మరణాలు, ఆఫ్ఘనిస్తాన్, ఆత్మాహుతి దాడి, యునామా , కాబూల్,

దర్వాజ-అంతర్జాతీయం

Kabul’s blast: కాబూల్ నగరం పశ్చిమ ప్రాంతంలో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో మరణించిన వారి సంఖ్య 53 చేరుకుందని ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ ( UNAMA ) తెలిపింది. “కాబూల్‌లోని హజారా క్వార్టర్‌లో శుక్రవారం తరగతి గది బాంబు దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దాడిలో 53 మంది మరణించారు. వీరిలో 46 మంది బాలికలు, యువ‌తులు ఉన్నారు. అలాగే, మ‌రో 110 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంద‌ని ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

మా మానవ హక్కుల బృందం నేరాన్ని డాక్యుమెంట్ చేస్తూనే ఉందని ఐరాస UNAMA తెలిపింది. శుక్రవారం ఉదయం పశ్చిమ కాబూల్‌లోని పరిసర ప్రాంతంలోని విద్యా కేంద్రంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆత్మాహుతి పేలుడు సంభవించిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అయితే, ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ టెర్ర‌రిస్టు గ్రూప్ లేదా వ్యక్తి బాధ్యత వహించలేదు.

Related Post