Breaking
Tue. Nov 18th, 2025

స‌రిహ‌ద్దులో చొరబాటుకు య‌త్నం.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

Terrorist, Killed, Infiltration, Jammu Kashmir, security forces, Sudpora, Karnah sector, Police, టెర్రరిస్ట్, హతం, చొరబాటు, జమ్మూ కాశ్మీర్, భద్రతా బలగాలు, సుద్పోరా, కర్నా సెక్టార్, పోలీస్,

ద‌ర్వాజ‌-శ్రీన‌గ‌ర్

Jammu Kashmir: జ‌మ్మూకాశ్మీర్ స‌రిహ‌ద్దులో ఉగ్ర‌వాదులు చోర‌బాటుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే నియంత్రణ రేఖ వెంబడి కర్నా సెక్టార్‌లోని సుద్‌పోరా వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఒక ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యారు.

వివ‌రాల్లోకెళ్తే.. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు బుధవారం భగ్నం చేశాయి. ఒక ఉగ్రవాదిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కర్నా సెక్టార్‌లోని సుద్‌పోరా వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు వారు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఒక విదేశీ ఉగ్రవాది హతమైనట్లు జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు వెల్ల‌డించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Post