Breaking
Tue. Dec 3rd, 2024

ఈ నెల 20న పీఆర్టీయూటీఎస్ కౌన్సిల్ స‌మావేశం.. నంగునూరులో పోస్టర్ ఆవిష్కరణ

Gajwel, Nanganoor, Siddipet, PRT, Telangana, Hyderabad, Harish Rao, గ‌జ్వేల్, నంగునూరు, సిద్దిపేట‌, పీఆర్టీయూ, తెలంగాణ‌, హైద‌రాబాద్, హ‌రీశ్ రావు,

ద‌ర్వాజ‌-నంగూనూరు

Nanganoor: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశము ఈనెల 20న (ఆదివారం) మహతి ఆడిటోరియం-గజ్వేల్ సిద్దిపేట జిల్లా లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు హాజరుకానున్నారు. అలాగే, ఎమ్మెల్సీలు కూర రగోతంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావులు పాలుపంచుకోనున్నారు.

ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్లో ఉన్న బదిలీలు ప్రమోషన్లు 317 జీవో సమస్యలు, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు గురువారం నాడు నంగునూరులోని ఉన్నత పాఠశాల పోస్టర్ ఆవిష్కరణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, మండల పీఆర్టీయూ అధ్యక్షులు పార్థసారథి, జనరల్ సెక్రెటరీ పంతం నరేష్, రాష్ట్ర జిల్లా నాయకులు శనిగరం కనకయ్య, సంగు రామకృష్ణ, భూపాల్ రెడ్డి, వెంకట నర్సారెడ్డి, శ్రీశైలం, రవీందర్ రెడ్డి, కొత్తపల్లి రవీందర్, వంశీకృష్ణ కన్యాలాల్, జీ. రాజమౌళి, సుధాకర్ రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు అనిత, అనిత, నాగలక్ష్మి లు పాల్గొన్నారు.

Share this content:

Related Post