Breaking
Tue. Nov 18th, 2025

ఎంపీ అరవింద్ నివాసంపై దాడిని ఖండించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్

బండి సంజ‌య్, బీజేపీ, ఆర‌వింద్, టీఆర్ఎస్, తెలంగాణ‌, హైదరాబాద్, Bandi Sanjay, BJP, Arvind, TRS, Telangana, Hyderabad,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

BJP leader Bandi Sanjay: రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత ముదురుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నాయ‌కుల మాట‌ల యుద్ధం పొలిటిక‌ల్ హీట్ పెంచింది. ఈ క్ర‌మంలోనే ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా స్పందించే సామర్థ్యం వారికి లేకపోవడం వల్లే దాడులు జరిగాయని పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగితే తట్టుకోలేరంటూ సంజయ్ హెచ్చ‌రించారు.

ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కే.కవిత బాధ్యత వహిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు, ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బాధ్యులైన వ్యక్తులను తమ పార్టీ హైకమాండ్ తగిన సమయంలో త‌గిన విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు.

Related Post