Breaking
Tue. Nov 18th, 2025

27న పద్మశాలి సంఘం ఎన్నికలు: సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్

Padmasali Sangam, Siddipet, Telangana, Hyderabad, Medak,

ద‌ర్వాజ-సిద్దిపేట‌

సిద్దిపేట పట్టణంలో పద్మశాలి భవనంలో అదివారం జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ శాలి సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్ మాట్లాడుతూ జిల్లా పద్మశాలి సంఘం కాలపరిమితి ముగిసినందున తక్షణమే ఎన్ని కలు నిర్వహించాలని ఎన్నికల అధికారిగా విశ్రాంత ప్రిన్సిపల్ దూడం అగయ్యను నియమించడం జరిగిందన్నారు. ఈనెల 27న ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

గత నాలుగు సంవత్సరాలు జిల్లా వ్యాప్తంగా హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, దుబ్బాక, సిద్దిపేట పట్టణం. బెజ్జంకి మండలలోని పద్మశాలీల ఏకతాటిపైకి తెచ్చి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం జరిగిందన్నారు. కరోనా కష్టకాంలో పేద పద్మశాలీలకు, చేనేత కార్మికులకు చేయూత అందించినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అవిష్కరించుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పద్మశాలీల సంక్షేమానికి సంఘం నిరంతరం కృషి చేసిందన్నారు.

పేద పద్మశాలి అడపిల్లల పెళ్లిళ్లకు పుస్తెలు, మెట్టెలు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు గుండు భూపేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్(ఎస్టీడి) బూర మల్లేశం, దయా సాగర్, వంగరి శ్రీశైలం, కాముని రాజేశం, చేర్యాల వెంకన్న, కుమ్మరికుంట రమేష్, మల్లేశం, గోనె మార్కండేయులు, లగిశెట్టి సతీష్ పాల్గొన్నారు.

Related Post