Breaking
Mon. Dec 2nd, 2024

రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. : ఐఎండీ

Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Cloudy sky-Rainfall: తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఉద్భవించే అవకాశం ఉన్న తాజా తుఫాను కారణంగా వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ ౩౦ వరకు వాతావ‌ర‌ణ మార్పు, పొగమంచు కార‌ణంగా రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్ లోని అన్ని జోన్లలో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని తెలిపింది. ఐఎండీ హైద‌రాబాద్ కార్యాల‌యం సూచన ప్రకారం, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉండ‌టంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వ‌ర‌కు పెరిగే అవకాశం ఉంది.

అంత‌కుముందు, బెంగళూరు సహా కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో నవంబర్ 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కోస్తా జిల్లాలైన ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపితో పాటు కొండ ప్రాంతాలైన శివమొగ్గ, కొడగు, హాసన్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక జిల్లాలు మాండ్య, రాంనగర్, మైసూరు, తుమకూరు, ఉత్తర కర్ణాటక జిల్లాలైన విజయపుర, హావేరిలలో కూడా మంగళవారం నుంచి వర్షాలు పడే అవకాశముంద‌ని తెలిపింది.

Share this content:

Related Post