దర్వాజ-చిత్తూరు
Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళయంలో పంట పొలాల్లో బోరు మీటర్ కు బిగించిన విద్యుత్ తీగను లాగిన ఒక ఏనుగు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత ఏనుగు మృతదేహాన్ని ఖననం చేశారు.
కాగా, జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు రోడ్లపైకి రావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు జనావాస గ్రామాలకు వస్తున్నాయి. ఏనుగులపై ప్రత్యేక నిఘా ఉంచి వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా వాటిని తిరిగి అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Share this content: