Breaking
Tue. Nov 18th, 2025

జ‌మ్మూకాశ్మీర్ ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

Encounter killing, Kulgam, Terrorism, Jammu Kashmir, Pulwama, ఎన్ కౌంటర్ , కుల్గాం, ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్, పుల్వామా,

దర్వాజ-జమ్మూకాశ్మీర్

Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు-ఉగ్ర‌వాదుల‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొదట గ్రెనేడ్ పేలుడు జరగడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఘటన స్థలం నుంచి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. జమ్మూలోని పంజ్‌తీర్థి-సిధ్ర రహదారిపై బుధవారం ఉదయం 7.30 గంటలకు ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉన్నారని జేకే ఏడీజీపీ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. “మేము ఒక ట్రక్కు అసాధారణ కదలికను గమనించాము. జమ్మూలోని సిధ్రా వద్ద ట్రక్కును ఆపిన వెంటనే డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. ట్రక్కులో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సైతం ఎదురుకాల్పులు జ‌రిపాయి అని సింగ్ చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు ఇప్పుడు హతమయ్యారు. కాగా, అంతకుముందు భధ్రతా బలగాలు భారీ ఉగ్రకుట్రను భగ్నచేశాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న 15 కిలోల బరువున్న ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (IED) పోలీసులు సోమవారం నిర్వీర్యం చేసిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Related Post