దర్వాజ-సిద్దిపేట
Siddipet: నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం సిద్దిపేట జిల్లా కార్యవర్గం ఈనెల 8వ న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్ కుమార్ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పద్మశాలి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. సిద్దిపేట వడ్డేపల్లి దయానంద్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి బంధువులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ సతీష్ కోరారు.
పద్మశాలి సంఘం సిద్దిపేట జిల్లా కార్యవర్గం తాజా కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు బూర మల్లేశం, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బూర మల్లేశం, కోశాధికారి డాక్టర్ స్వామి, సిద్దిపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామన్ రాజేశం, రాష్ట్ర బాధ్యుడు వంగరి శ్రీశైలం, జిల్లా నాయకులు దేవేందర్, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, వెంకన్న, జోగు బిక్షపతి, వడ్డేపల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.