దర్వాజ-న్యూఢిల్లీ
Centre to ban 232Chinese apps: చైనాకు మరోసారి భారత్ షాకిచ్చింది. చైనాకు చెందిన 232 మొబైల్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి. అత్యవసర ప్రాతిపదికన చైనాతో సంబంధం ఉన్న ఈ యాప్ లపై నిషేధం విధించినట్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)కు ఈ వారంలో ఉత్తర్వులు అందినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి.
ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం భారత సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించే అంశాలు ఈ యాప్ లలో ఉన్నాయని గుర్తించిన తర్వాత చైనా యాప్ లపై నిసేధ విధించే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Centre to ban 138 betting apps, 94 loan lending apps with Chinese links
— ANI Digital (@ani_digital) February 5, 2023
Read @ANI Story | https://t.co/VBvMA0UCRV#chineseapps #China #ChinaAppsBan pic.twitter.com/UKYSmlDaGj
కాగా, భారత భద్రతకు ముప్పుగా ఉన్నాయని గుర్తించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్ లపై నిషేధం విధించింది. వాటిలో టిక్ టాక్, వీచాట్, హాలో, యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్ వంటివి ఉన్నాయి.