దర్వాజ-ఇస్తాంబుల్
Turkey earthquake death toll crosses 15,000 mark: దక్షిణ టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా వేల మంది ప్రణాలు కోల్పోయారు. అనేక నగరాలు దెబ్బతిన్నాయి. ఇండ్లు, భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
టర్కీ, సిరియా భూకంపం తాజా వివరాలు..
- టర్కీ, సిరియా భూకంపం కారణంగా ఇప్పటివరకు 15,000 మందికి పైగా మరణించారు.
- భూకంప సహాక చర్యల నేపథ్యంలో ప్రభుత్వం పై విమర్శలు చేసిన తరువాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ లోపాలను అంగీకరిస్తూనే.. వాటిని ఖండించారు. ప్రభుత్వ చర్యలపై కావాలనే అసత్యాలు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
- ఈ విపత్కర సమయంలో కలిసి రావాలనీ, ప్రతి పౌరుడి రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఎర్డోగన్ తెలిపారు.
- భూకంపం నేపథ్యంలో టర్కీలోని పది ప్రావిన్సుల్లో 90 రోజుల ఎమర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది.
- శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అనేక దేశాలు టర్కీకి సహాయం అందిస్తున్నాయి. ఇప్పటివరకు భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 15 వేలు దాటిందిత. టర్కీలో 12,391 మంది, సిరియాలో 2,992 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 15,383కు చేరుకుంది.
- భూకంపం కారణంగా ఆసుపత్రులతో పాటు ఏడు వేర్వేరు ప్రావిన్సుల్లో భారీ సంఖ్యలో భవనాలు, ఇండ్లు కుప్పకూలాయి.
- భూకంపం తర్వాత 70 దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థలు టర్కీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయని టర్కీ ప్రభుత్వం పేర్కొంది.
- భారత్ టర్కీకి సాయం చేయడాకి ‘ఆపరేషన్ దోస్త్ ను ప్రకటించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అవసరమైన సెర్చ్ అండ్ యాక్సెస్ ఎక్విప్మెంట్, మందులు, వైద్య పరికరాలను పంపింది.