Breaking
Tue. Nov 18th, 2025

ఏపీ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్

ఆంధ్రప్రదేశ్ , గవర్నర్ , సుప్రీంకోర్టు , జస్టిస్ అబ్దుల్ నజీర్, అమ‌రావ‌తి,Andhra Pradesh, Governor, Supreme Court, Justice Abdul Nazir, Amaravati,

దర్వాజ-అమరావతి

Governor of Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయిన ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

రాష్ట్రపతి ఆదివారం 12 మంది కొత్త గవర్నర్లను నియమించారు. అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ ఒకరు.

ఇత‌ర రాష్ట్రాల‌కు నియ‌మితులైన గ‌వ‌ర్న‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

భగత్ సింగ్ కోషియారీ స్థానంలో రమేష్ బైస్ మహారాష్ట్ర కొత్త గవర్నర్ గా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య – సిక్కిం, సీపీ రాధాకృష్ణన్ – జార్ఖండ్, శివ ప్రతాప్ శుక్లా – హిమాచల్ ప్రదేశ్, గులాబ్ చంద్ కటారియా – అస్సాం, సుష్రీ అనుసూయ ఉక్యే – మణిపూర్, లా గణేశన్ – నాగాలాండ్, ఫాగు చౌహాన్ – మేఘాలయ, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ – బీహార్, బిర్గ్ బిడి మిశ్రా లడఖ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

Related Post