దర్వాజ-న్యూఢిల్లీ
PM Modi Inaugurates Mega National Tribal Festival: దేశరాజధాని ఢిల్లీలో నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ కార్యక్రమం కొనసాగుతోంది. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రధాని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా పాల్గొన్నారు.
PM @narendramodi inaugurates #AadiMahotsav and pays homage to tribal freedom fighter Birsa Munda at Major Dhyan Chand National Stadium in Delhi@TribalAffairsIn #AadiMahotsav2023 pic.twitter.com/vVwpxrQTcw
— PIB India (@PIB_India) February 16, 2023
ఆది మహోత్సవ్ గిరిజన సంస్కృతి, హస్తకళలు, వంటకాలు, వాణిజ్యం- సాంప్రదాయ కళల స్ఫూర్తికి గుర్తింపుగా ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు జరగనుంది. ఆది మహోత్సవ్ అనేది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సుమారు 1000 మంది గిరిజన కళాకారులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు.
Aadi Mahotsav celebrates India's glorious tribal culture and traditions. https://t.co/fxRFUeH7dG
— Narendra Modi (@narendramodi) February 16, 2023