దర్వాజ-హైదరాబాద్
Delhi liquor scam: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత మద్యం కుంభకోణం కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నాయకుడు జీ.వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యాలు చేశారు. త్వరలో ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేస్తారంటూ వ్యాఖ్యానించారు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాదిరిగానే టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జీ.వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ మద్యం కుంభకోణం గురించి అందరికీ తెలుసు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల నిధుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కవితతో మాట్లాడి ఆప్ ప్రభుత్వానికి రూ.150 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే సిసోడియా మాదిరిగానే ఆమెను కూడా అరెస్టు చేస్తారు” అని చెప్పారు.