దర్వాజ-హైదరాబాద్
Shocking incident in Hyderabad: హైదరాబాద్ లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలురను టార్గెట్ చేసి వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్నాడు ఒక వ్యక్తి. ఇదే క్రమంలోనే ఒక బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనను గుర్తించి, దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 342 (అక్రమ నిర్బంధం), ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఈ ఏడాది జనవరిలో 15 ఏళ్ల బాలుడిని బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. తలాబ్‌కట్టకు చెందిన నిందితుడు అబ్దుల్ ఇర్ఫాన్ (28)పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ వ్యక్తి బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామనీ, ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేశామని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. జనవరి 26న నమోదైన ఎఫ్ఐఆర్ ను ప్రస్తావిస్తూ, ఒక పోలీసు కానిస్టేబుల్ ఆన్ లైన్ లో వీడియోను గుర్తించి క్రమంలో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 342 (అక్రమ నిర్బంధం), ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలుడిని బలవంతంగా మద్యం తాగించి ఓ గదిలో లైంగిక దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడాన్ని భవానీ నగర్ పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి పనిచేస్తున్న కానిస్టేబుల్ గుర్తించారు. అనంతరం తలాబ్ కట్టలోని కాలనీకి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ గా నిందితుడిని గుర్తించామని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అంజాద్ అలీ తెలిపారు. ప్రాథమిక ఆధారాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.