ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల, పూర్తి వివ‌రాలు

తెలంగాణ‌, హైద‌రాబాద్, ఇంట‌ర్ విద్యార్థులు, హాల్ టిక్కెట్లు, Telangana, Hyderabad, Inter students, Hall Tickets, TS Intermediate hall tickets, hall tickets, TS Inter Hall Tickets,

దర్వాజ-హైదరాబాద్

TS Intermediate hall tickets : తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లును ఇంట‌ర్ బోర్డు సోమవారం నాడు విడుదల చేసింది. కాలేజీలు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునీ, విద్యార్థుల‌కు అందించాలి సంబంధిత వ‌ర్గాలు సూచించాయి. కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాలేజీలు తమ లాగిన్ల నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని వెంటనే విద్యార్థులకు ఇవ్వాల‌ని ఉన్న‌తాధికార‌లు ఆదేశించారు.

వివరాలు చెక్ చేసుకోండి..

హాల్‌టికెట్లను అందుకున్న స‌మ‌యంలో విద్యార్థులు త‌మ వివ‌రాల‌ను చెక్ చేసుకోవాల‌ని సూచించారు. హాల్‌టికెట్లపై వారి ఫొటోలు, సంతకాలు, పేర్లు, మీడియం, సబ్జెక్టుల స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల‌న్నారు. ఏమైనా త‌ప్పులు ఉంటే కాలేజీ యాజమాన్యం లేదా జిల్లా ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి తీసుకురావాల‌ని తెలిపారు.

ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్

ప‌రీక్ష‌ల కోసం అన్ని ఏర్పాట్లు సైతం చేస్తున్నామ‌ని ఇంట‌ర్ డోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జ‌రుగుతాయ‌న్నారు. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

ఇంటర్మీడియట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ షెడ్యూల్

  • మార్చి 15-సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
  • మార్చి 17-ఇంగ్లీష్ పేపర్
  • మార్చి 20-మ్యాథ్స్ పేపర్ 1ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్
  • మార్చి 23-మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ/ హిస్టరీ
  • మార్చి 25-పిజిక్స్/ ఎకనామిక్స్
  • మార్చి 28-కెమిస్ట్రీ/ కామర్స్
  • మార్చి 31-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్బై
  • ఏప్రిల్ 03-మోడ్రన్ ల్యాంగ్వేజ్/ జియోగ్రఫీ

ఇంటర్ సెకండియ‌ర్ షెడ్యూల్

  • మార్చి 16-సెకండ్ ల్యాంగ్వేజ్
  • మార్చి 18-ఇంగ్లీష్
  • మార్చి 21-మ్యాథ్స్ పేపర్ 2ఏ/ బోటనీ/ పొలిటికల్ సైన్స్
  • మార్చి 24-మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ/ హిస్టరీ
  • మార్చి 27-ఫిజిక్స్/ ఎకనామిక్స్
  • మార్చి 29-కెమిస్ట్రీ / కామర్స్
  • ఏప్రిల్ 01-పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2/ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2
  • ఏప్రిల్ 04-మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2/ జియోగ్రఫీ

Related Post