రాజస్థాన్ లో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్ట‌ర్ స్కేల్ పై 4.2 తీవ్రత న‌మోదు

Earthquake, Rajasthan, Bikaner, NCS, భూకంపం, రాజ‌స్థాన్, ఎన్సీఎస్, బిక‌నీర్,

ద‌ర్వాజ‌-జైపూర్

Rajasthan Earthquake: రాజస్థాన్ లోని బికనీర్ లో ఆదివారం తెల్లవారుజామున 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2:16 గంటలకు బికనీర్ లో భూకంపం సంభవించిందనీ, దాని ప్రకంపనలు పరిసర ప్రాంతాల్లో కూడా సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. బికనీర్ కు పశ్చిమాన 516 కిలోమీటర్ల దూరంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. కాగా, భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ లో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. శుక్రవారం ఉదయం 10:31 గంటలకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు 28 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు కూడా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

అలాగే, మణిపూర్ లోని మొయిరాంగ్ లో రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్ర‌త‌తో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. మొయిరాంగ్ లో ఉదయం 08:52 గంటలకు భూకంపం సంభవించింది.

రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రతతో భూకంపం మణిపూర్ లోని మొయిరాంగ్ లో శుక్రవారం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్ ) తెలిపింది. ఉదయం 08:52 గంటలకు మొయిరాంగ్ లో భూకంపం సంభవించినట్లు ఎన్ ఎస్ సీ తెలిపింది. అలాగే, గురువారం కూడా మొయిరాంగ్ కు తూర్పు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. సాయంత్రం 6:51 గంటలకు మొయిరాంగ్ లో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

Related Post