మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీల‌ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ బిల్లు, పార్లమెంట్‌, బీఆర్ఎస్ , వాయిదా తీర్మానం, BRS, adjournment motion, Parliament, Womens Reservation Bill,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎంపీలు మంగ‌ళ‌వారం నాడు పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత మాలోత్ మంగళవారం పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

కాగా, బీఆర్ఎస్ లీడ‌ర్, ఎమ్మెల్సీ కే. క‌విత గ‌త కొంత కాలంగా మ‌హిళ రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం పోరాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇటీవ‌ల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూనిరాహార దీక్ష కూడా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ తో పాటు, దేశంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో రౌండ్ టేబుల్ చర్చలు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం.

Related Post