దర్వాజ-రాయ్‌పూర్
IED blast.. Two BSF jawans injured:ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం ఉదయం నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ )కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కోయలిబేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకేర్ కు 120 కిలోమీటర్ల దూరంలోని చిల్పరాస్ లోని బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలో బీఎస్ఎఫ్ బృందం రోడ్డు భద్రతా ఆపరేషన్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గాయపడిన జవాన్లను కోయలిబేడలోని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకగడా ఉందని పేర్కొన్నారు. కాగా, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ప్రెషర్ ఐఈడీ పేలుడులో ఛత్తీస్ గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్ (సీఏఎఫ్) అసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ మృతి చెందారు.