జీఎస్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశాం.. : కేంద్రంపై మమతా బెనర్జీ విమ‌ర్శ‌లు

Mamata Banerjee
Mamata Banerjee

ద‌ర్వాజ‌-కోల్ క‌తా

West Bengal Chief Minister Mamata Banerjee: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడమే తృణమూల్ కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పిదమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కన రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా రాష్ట్రం నుంచి మొత్తం డబ్బును లాక్కుంటోందని ఆరోపించారు.

“జీఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వానికి మద్దతివ్వడమే మేం చేసిన అతి పెద్ద తప్పు. దాని వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల విడుదలను నిలిపివేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి పీఎంఏవై వరకు పథకాల కింద నిధులు రాష్ట్రానికి చేరడం ఆగిపోయాయి” అని హుగ్లీ జిల్లాలోని సింగూరులో గ్రామీణ రహదారి నెట్వర్క్ ను ప్రారంభించిన సందర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు.

బుధవారం నుంచి కోల్ కతాలోని రెడ్ రోడ్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం రాత్రి 7 గంటల వరకు ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. “సింగూరులో రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 14 రోజులుగా నిరాహార దీక్ష చేశాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ భూమిని సింగూరు రైతులకు తిరిగి ఇచ్చాం. ఈ అంశంపై తమ ఉద్యమానికి సింగూరు రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారు” అని ఆమె పేర్కొన్నారు.

Related Post