దర్వాజ-క్రీడలు
GT vs CSK Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2023) 16వ ఎడిషన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. శుభమాన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

శుభమాన్ గిల్ అద్భుత ఆఫ్ సెంచరీతో నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ కేవలం 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 92 పరుగులు చేయగా, ఎంఎస్ ధోనీ 14 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో చెన్నై 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీయగా, జాషువా లిటిల్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.