దర్వాజ-న్యూఢిల్లీ
COVID-19: భారత్ లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజువారి కేసులు క్రమంగా పెరుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 10 వేలకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం పెరుగుతున్నాయి.
అంతకుముందు రోజుతో పోలిస్తే భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులు 10,158 కు పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసులు 44,998గా ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ ఏడాది తొలిసారిగా బుధవారం 1,000కు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, భారతదేశంలో బుధవారం 7,830 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది మంగళవారం 5,675 కేసులు నమోదైనప్పటి నుండి గణనీయంగా పెరిగింది. 6 నెలల్లోనే అత్యధిక కేసులు.. ఢిల్లీ, ముంబై నగరాల్లో నమోదవుతూ వేయిని దాటాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.02 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.10 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,10,127కి చేరింది. కాగా, దేశంలో 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను ప్రజలకు అందించారు.