Breaking
Tue. Nov 18th, 2025

వడదెబ్బతో నలుగురు మృతి.. తెలంగాణ‌లో మ‌రింత పెర‌గ‌నున్న ఎండ‌లు

heat stroke, sunstroke , temperature,

దర్వాజ-హైదరాబాద్

Four die of heat stroke in Telangana: తెలంగాణలో ఎండ‌లు మండిపోతున్నాయి. వేడిగాలుల తీవ్ర‌త కార‌ణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌డ‌దెబ్బ‌కు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బతో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, మంచిర్యాల, వరంగల్ లో ఒక్కొక్కరు చ‌నిపోయార‌ని సియాస‌త్ నివేదించింది.

ఆదిలాబాద్ లో పొలంలో మండుతున్న ఎండలో పనిచేస్తూ ఎస్.లింగయ్య (70) అనే రైతు వ‌డ‌దెబ్బ‌కు గురై మృతి చెందారు. అలాగే, నిర్మల్లో ఉపాధిహామీ పథకం కింద చెరువు ఒడ్డున పనిచేస్తున్న పి.రాజేశ్వర్ (45) అకస్మాత్తుగా కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయారు. మంచార్ పాల్ లో పండ్ల వ్యాపారి శ్రీనివాస్ (55) వడదెబ్బకు గురై మ‌ర‌ణించాడు. వరంగల్ లోనూ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా, 10 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ఈ వారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

https://darvaaja.com/covid-19-updates-covid-new-cases-cross-11000-in-a-single-day-increased-deaths/

Related Post