Breaking
Tue. Nov 18th, 2025

Karnataka Assembly Election: మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి.. : ప్ర‌కాశ్ రాజ్

Karnataka Assembly Election

దర్వాజ-బెంగళూరు

Prakash Raj casts his vote: ర్ణాటకలో బుధ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే న‌టుడు ప్రకాశ్ రాజ్ ఓటు వేశారు. ఆయ‌న బెంగళూరులోని శాంతి నగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాల‌న్నారు. కర్ణాటక అందంగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు.

అలాగే, బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో అమూల్య తన భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. న‌టుడు గణేష్, ఆయన సతీమణి, నటుడు రమేష్ అరవింద్ బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Post