దర్వాజ-న్యూఢిల్లీ
Praveen Sood takes charge as new CBI director: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. 1986 కర్ణాటక కేడర్ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సోనూసూద్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ సెలక్షన్ కమిటీ కేంద్ర దర్యాప్తు సంస్థ అధిపతిగా నియమించింది.
సీబీఐ కొత్త చీఫ్ ప్రవీణ్ సూద్ గురించిన కీలక విషయాలు
- సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు ప్రవీణ్ సూద్ కర్ణాటక డీజీపీగా పనిచేశారు.
- దాదాపు 37 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్ పదవీకాలంలో సోనూసూద్ పలు కీలక పదవుల్లో పనిచేశారు.
- బళ్లారి, రాయచూరు ఎస్పీలుగా ఉన్నారు. బెంగళూరు సిటీ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) మైసూరు నగరం, బెంగళూరు నగర పోలీసు కమిషనర్లు, ఏడీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ (అంతర్గత భద్రత), డీజీపీ (సీఐడీ)గా ఆయన సేవలు అందించారు.
- మారిషస్ ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు.
- అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ప్రభావాలు కలిగిన కేసుల దర్యాప్తు, సైబర్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి నేరాల దర్యాప్తు, గుర్తింపును ఐపీఎస్ అధికారి పర్యవేక్షించారు.
- న్యాయవ్యవస్థతో పాటు కర్ణాటక రాష్ట్రంలో సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), ఐసీజేఎస్ (ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) నెట్వర్క్ల బలోపేతానికి కృషి చేశారు.
- ప్రవీణ్ సూద్ ఢిల్లీ ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
- IIM, బెంగళూరు, మాక్స్‌వెల్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, సిరక్యూస్ యూనివర్శిటీ, న్యూయార్క్ నుండి పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
- ప్రవీణ్ సూద్ కు 2011లో విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 2002లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు లభించాయి.
- 1996లో ముఖ్యమంత్రి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్ అందుకున్నారు.
- 2011 సంవత్సరంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత వినూత్నంగా ఉపయోగించినందుకు నేషనల్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు అందుకున్నారు.
- రహదారి భద్రత & ట్రాఫిక్ నిర్వహణకు కృషి చేసినందుకు 2006 సంవత్సరంలో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు.
