జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో టీడీపీ కొత్త ప్రచారం

TDP, Chandrababu Naidu, AP govt, crimes , women, Disha Act , Y. S. Jagan Mohan Reddy, టీడీపీ, చంద్ర‌బాబు నాయుడు, ఏపీ ప్ర‌భుత్వం, మ‌హిళ‌లు, దిశా చ‌ట్టం, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి,

దర్వాజ-విజయవాడ

TDP launches new campaign ‘Nalugella Narakam’: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రచారాన్ని ప్రకటిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు, హింస పెరిగిపోతున్నాయని గణాంకాలతో రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ వీడియో ఎత్తిచూపింది.

ఈ వీడియోలో మహిళలపై జరుగుతున్న ప్రధాన నేరాలను ప్రస్తావించారు. ఏలూరులో పదో తరగతి విద్యార్థిని సజీవ దహనం, యాసిడ్ దాడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నెల్లూరు, మచిలీపట్నం అత్యాచారాలపై జగన్ మౌనాన్ని ప్రశ్నించారు. జగన్ నిజంగా ప్రజల బిడ్డ అయి ఉంటే ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడే సొంత పార్టీ నేతలను కాపాడేవారు కాదన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న జగన్ ప్రభుత్వంపై ఏదో ఒక చర్య తీసుకునేలా ఒత్తిడి తేవడమే ఈ ప్రచార లక్ష్యమని ప్రతిపక్ష్ పార్టీ పేర్కొంది. రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఉద్యోగాలు లేకపోవడం, విద్య, వైద్యం అధ్వాన్నంగా ఉండటం వంటి వాటిపై ప్రజలకు అన్యాయం జరిగిన వివిధ మార్గాలపై ఈ క్యాంపెయిన్ దృష్టి సారించనుంది.

ముఖ్యంగా మహిళలపై నేరాలు, హింసా శాతం పెరగడాన్ని కూడా ఇది హైలైట్ చేయనుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారు వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ వీధుల్లోకి తీసుకువెళ్లి నెలంతా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని టీడీపీ యోచిస్తోందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించనున్నారు. ‘NalugellaNarakam’ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో పాల్గొని జగన్ విఫల పాలనపై తమ అనుభవాలను పంచుకోవాలని తమ క్యాడర్ కు, ప్రజలకు టీడీపీ విజ్ఞప్తి చేసింది.

Related Post