దర్వాజ-రంగారెడ్డి
Police Jobs-Devuni Padakal: దేవునిపడకల్ గ్రామంలోని ముగ్గురు ఎస్సై ఉద్యోగాలు సాధించారు. నిరుపేద కుటుంబ నేపథ్యంలో కలిగిన వీరు పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించడంలో వారి కుటుంబాలతో పాటు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగాల పొందడం కోసం వారు కష్టపడిన తీరును కొనియాడుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఇటీవల తెలంగాణ పోలీసులు శాఖ పోలీసు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించింది. ఇందులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల నుంచి నలుగురు ఎస్పై ఉద్యోగాలకు అర్హత సాధించారు. దీనికి సంబంధించి వారికి పోలీసు శాఖ మెయిల్ పంపించింది. వారిలో దేవుని పడకల్ గ్రామం నుంచి ఎస్పై ఉద్యోగాలు సాధించిన వారు ముగ్గురు ఉన్నారు. పద్మ మార్కాండేయ-యాదమ్మల కుమారుడు పద్మ శ్రీధర్, కాడమోని నర్సింహ్మ-సత్యమ్మల కుమారుడు కాడమోని శివతో పాటు రావిచెడ్ అంజయ్య-ఈశ్వరమ్మల కుమార్తె మానసలు ఎస్పై ఉద్యోగాలు సాధించారు. అలాగే, మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన జీ మౌనిక ఎస్సై ఉద్యోగానికి ఎంపికైంది.
తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎస్సై ఉద్యోగాలు సాధించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై ఉద్యోగాలు సాధించిన మౌనిక, మానస, శ్రీధర్, శివలను ఘనంగా సన్మానించారు.