Breaking
Tue. Nov 18th, 2025

రామ‌ప్పలో మేడారం భ‌క్తుల తాకిడి

medaram jathara completed copy
medaram jathara completed copy
  • రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
  • భక్తులను కనువిందు చేసిన రామప్ప సరస్సు

దర్వాజ, రామప్ప:

కాకతీయుల కళా దర్పణమైన‌ రామప్ప ఆల‌యానికి భక్తులు పోటెత్తారు. మినీ మేడారం జాత‌ర ముగుస్తుండ‌టంతో వన దేవతల‌ను ద‌ర్శించ‌కునే భ‌క్తులు రామ‌ప్ప రామ‌లింగేశ్వ‌రున్ని ద‌ర్శించుకుని పోవ‌డం ఆన‌వాయితి. అలాగే ఆదివారం కావ‌డంతో రామ‌ప్ప‌కు భ‌క్తుల తాకిడి ఎక్కువైంది. దాంతో ఆల‌యం భ‌క్తుల‌తో కిక్కిరిసిపోయింది.

ramappa-temple రామ‌ప్పలో మేడారం భ‌క్తుల తాకిడి

భ‌క్తులు అధిక సంఖ్య‌లో రావ‌డంతో రామలింగేశ్వరుని సన్నిధికి సమ్మక్క, సార‌ల‌మ్మ‌ భక్తుల కళ సంతరించుకుంది. ఆ సంద‌ర్భంగా పూజారులు రామ‌లింగేశ్వ‌రునికి ప్రత్యేక పూజలు చేశారు. ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు త‌మ మొక్కుల‌ను చెల్లించుకున్నారు. భ‌క్తుల‌కు పూజారులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ విజయ్ ,వెంకటేష్ లు రామప్ప శిల్పకళా నైపుణ్యాల‌ను భ‌క్తుల‌కు వివ‌రించారు.

ramappa-temple1 రామ‌ప్పలో మేడారం భ‌క్తుల తాకిడి

ఆలయ తూర్పు దిశలో ఉన్న నందీశ్వరుని ద‌గ్గ‌ర భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువైంది. రామప్ప సరస్సు అందాలు ఎంతో చూడ‌చ‌క్క‌గా ఉన్నాయంటూ ప‌లువురు భ‌క్తులు మీడియాకు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కూడా రామ‌ప్ప భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంద‌ని పూజారులు తెలిపారు.

రిపోర్టర్: ఆకుల రామకృష్ణ‌, రామ‌ప్ప‌

ప్రేమంటే సంపేసుడేనా ?

ముగిసిన మేడారం మినీ జాత‌ర‌!

సమ్మక్క సారలమ్మల కథ!

టమాటాతో ఇవి మీ సొంతం..!

రాజా.. ఏంటీ క‌య్యం ?

Related Post