Loading Now
చంద్ర‌యాన్-3, ఇస్రో, చంద్రుడు, భూమి, భార‌త్, Chandrayaan-3, ISRO, Moon, Earth, India,Vikram, Pragyan, విక్ర‌మ్ ల్యాండ‌ర్, ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్,

చంద్రయాన్-3 ల్యాండింగ్ చారిత్రాత్మకం..

దర్వాజ-న్యూఢిల్లీ

Chandrayaan-3: చంద్ర‌యాన్-3 విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు భార‌త్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స్పందించిన అమెరికా జాబిల్లిపై చంద్ర‌య‌న్-3 ల్యాండింగ్ చారిత్రాత్మ‌క‌మ‌ని పేర్కొంది. అంత‌కుముందు, అమెరికా, రష్యా సోవియ‌ట్ యూనియ‌న్, చైనాలు మాత్ర‌మే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. ఇక చందుని ద‌క్షిణ ధృవంపై కాలుమోపిన మొట్ట‌మొద‌టి దేశంగా భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది.

భారతదేశం చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సహకరించి, దాని పురోగతిని నిశితంగా పరిశీలించిన అమెరికా, బుధవారం చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై భారత వ్యోమనౌక చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ ప్రశంసించడంలో ప్రపంచంతో కలిసిపోయింది. “చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ -3 చారిత్రాత్మక ల్యాండింగ్ కోసం @ISRO, భారత ప్రజలకు అభినందనలు” అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

రానున్న సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ విలేకరుల సమావేశంలో ఈ మిషన్ కు అమెరికా కీలక సహాయాన్ని అందించిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ ల సహాయాన్ని కూడా ఆయన అంగీకరించారు. ‘చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం విజయవంతంగా ల్యాండ్ అయినందుకు @isro అభినందనలంటూ నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఎక్స్ లో పేర్కొన్నారు.

“చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా #India స‌రికొత్త సృష్టించింది. భార‌త్ కు అభినందనలు.. ఈ మిషన్ లో మీ భాగస్వామిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని” త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

Share this content:

You May Have Missed